హైదరాబాద్ : సినీ దర్శకుడు, రచయిత మనోహర్ చిమ్మని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్థానంపై రాసిన 'కేసీఆర్... ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్` అనే పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ప్రగతి భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, మనోహర్ చిమ్మని వంటి రచయిత ఎంతో శ్రమించి కేసీఆర్ పై ఒక మంచి పుస్తకం తీసుకురావడం హర్షణీయమన్నారు. ఆయనకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు.
కేసీఆర్... ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్ పుస్తకాన్ని తాను తప్పకుండా చదువుతానని, పుస్తకంపై తన సమీక్షను ట్విట్టర్ లో పంచుకుంటానని తెలిపారు. తెలంగాణను సాకారం చేసిన వ్యక్తి కేసీఆర్ అని.. ఇంతజేసినా ఆయనను కొందరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Jul,2022 04:47PM