హైదరాబాద్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు ఘోర ఓటమి చవిచూసింది. దాంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను ఇంగ్లండ్ 2-2తో సమం చేసింది. ఓవర్ నైట్ స్కోరు 259/3తో ఐదో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టులో జో రూట్ (142 నాటౌట్), బెయిర్‌స్టో (114 నాటౌట్)లు చెలరేగి ఆడారు. ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు 377 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. 7 వికెట్లతో విజయం సాధించినట్టయింది.
భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేయగా ఇంగ్లండ్ 284 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లు విజృంభించడంతో245 పరుగులకు చేతులెత్తేసింది. 378 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు 76.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Jul,2022 04:59PM