హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు ఒకానొక దశలో 600 పాయింట్లకు పైగా లాభపడ్డాయి. అయితే, ఆర్థికమాంద్యం భయాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో మార్కెట్లు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టపోయి 53,134కి పడిపోయింది. నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 15,810కి జారుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm