హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలంలో 440 కిలోల గంజాయిని సోమవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.దాని విలువ రూ. కోటి ఉంటుందని చెప్పారు. అలాగే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, మరో నలుగురు పరారీలో ఉన్నట్టు చెప్పారు.
ఉప్పల్ భగాయత్లోని రాఘవేంద్ర కాలనీలో గంజాయి రవాణా, విక్రయిస్తున్నారనే సమాచారంతో అధికారులు దాడి చేశారు. టాటా డీసీఎం వ్యాన్, టయోటా ఎటియోస్ కారులో 27 ప్లాస్టిక్ డబ్బాల్లో గంజాయి పొడి ప్యాకెట్లను తరలిస్తున్నట్టు గుర్తించారు మొత్తం 216 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి ప్యాకెట్లతోపాటు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న పేరపురెడ్డి అర్జున్, నేరెళ్ల కిరణ్కుమార్, సయ్యద్ తాహెర్ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పేరపురెడ్డి రాజ్ వీరేంద్రకుమార్, సందీప్, తేజ, ఫజల్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Jul,2022 06:55PM