అమరావతి : ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం 2018లో ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మెన్ గౌతం సవాంగ్ మంగళవారం ఈ ఫలితాలను ప్రకటించారు. మొత్తం 167 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్టుల్లో కేసుల కారణంగా పోస్టుల భర్తీ ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంది.
తాజాగా ప్రకటించిన ఫలితాల్లో 167 పోస్టులకు గాను 163 పోస్టులను భర్తీ కాగా వివిధ కారణాల వల్ల 4 పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీ చేయలేదు. ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 67 మంది మహిళలు ఉండగా.. 96 మంది పురుషులు ఉన్నారు. ఇక టాపర్ల విషయానికి వస్తే తొలి, రెండు ర్యాంకుల్లో ఏపీకి చెందిన అభ్యర్థులే ఉండగా మూడో ర్యాంకులో తెలంగాణకు చెందిన యువతి నిలిచింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Jul,2022 07:05PM