హైదరాబాద్ : ఉప్పల్‌లో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల విలువైన గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. మల్కాజిగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి గంజాయిని డీసీఎంలో నగరానికి తీసుకొచ్చి మంగళవారం ఉప్పల్ రాఘవేంద్రనగర్‌లో కారులోకి మార్చుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను పట్టుకొని 440 కిలోల గంజాయి, డీసీఎం, కారు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన పేరపురెడ్డి అర్జున్, గోదావరిఖనికి చెందిన నేరెళ్ల కిరణ్‌కుమార్, హైదరాబాద్ ఫలక్‌నుమాకు చెందిన సయ్యద్ తాహెర్‌ను అరెస్టు చేశారు. రాజ్‌వీరేందర్‌కుమార్, సందీప్, తేజా, ఫజల్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm