హైదరాబాద్ : దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ కోసం మరోసారి రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతనెల 17న వైసీపీ ఎమ్మెల్సీ బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసి విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ఉదయం రాజమండ్రి కోర్టులో అనంతబాబు తరుపు న్యాయవాదులు మరోసారి పిటిషన్ వేశారు. బెయిల్ పిటీషన్‌పై విచారణను ఎస్సీ - ఎస్టీ కోర్ట్ న్యాయమూర్తి ఈనెల 11కు వాయిదా వేశారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకేసులో అనంతబాబు మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm