నిర్మల్: జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి పెద్దఎత్తున వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 9861 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 16,084 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులుకాగా, ప్రస్తుతం 693 అడుగుల వద్ద నీరు ఉన్నది.
Mon Jan 19, 2015 06:51 pm