హైదరాబాద్ : మన ఊరు- మన బడి టెండర్ల ప్రక్రియపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. వీ3 ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ పిటిషన్ దాఖలు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు టెండర్ల ప్రక్రియ ఆపేయాలని కోర్టు ఆదేశించింది.
ఎలగంట్ మేథడక్స్ సంస్థ టెండర్ అన్ని నిబంధనలు భర్తీ చేసి అర్హత సాధించినట్టు పేర్కొనడం చట్టవిరుద్దం అని పిటిషనర్లు తెలిపారు. టెండర్ నిబంధనలలోని అన్ని అర్హతలు తమకున్నాయని వారు చెప్పారు. అన్ని ఆధారాలు సమర్పించినప్పటికీ కారణం చెప్పకుండా టెండర్ ఇవ్వలేదని కోర్టుకు చెప్పారు. ఏ కారణంగా అర్హత లేని కాంట్రాక్టరుగా చూపారో చెప్పలేదని పిటిషనర్లు తెలిపారు. పిటిషన్లో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, టీఎస్ డబ్ల్యూఐ డీసీ(తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతులు అభివృద్ధి సంస్థ), చీఫ్ ఇంజనీరు, ఎలెగంట్ మెథడాక్స్లు ప్రతివాదులుగా ఉన్నారు. విచారణ జరిపిన హైకోర్టు టెండర్ల ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 11కు వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 06 Jul,2022 02:24PM