హైదరాబాద్ : వచ్చే ఏడాది నుంచి ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు కేంద్ర పర్యాటకశాఖ తరఫున నిధులిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పాల్గొని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి ఢిల్లీలో బోనాల పండుగ మరింత ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఉత్సవాలకు వచ్చే ఏడాది నుంచి కేంద్ర పర్యాటక శాఖ నుంచి నిధులిస్తామని తెలిపారు. లాల్‌దర్వాజ కమిటీ ఇతర ఆలయాలను కలుపుకొని ఉత్సవాలు జరపాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm