న్యూఢిల్లీ: స్పైస్‌జెట్‌కు షాక్ తగిలింది. ఆ సంస్థకు పౌర విమానయాన సంస్థల నియంత్రణ విభాగం (డీజీసీఏ) బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. స్పైస్‌జెట్ విమానాల వరస సాంకేతిక కారణాలతో ప్రయాణికులను ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే. గత 18 రోజుల్లో ఎనిమిది విమానాల్లో సాంకేతిక లోపాల సమస్యలు తలెత్తాయి. దాంతో సురక్షితమైన, సమర్థవంతమైన, నమ్మకమైన వైమానిక సేవల్ని కల్పించడంలో స్పైస్‌జెట్ సంస్థ విఫలమైనట్లు ఏవీయేషన్ రెగ్యూలేటరీ సంస్థ డీజీసీఏ అభిప్రాయపడింది.
ఈ ఘటనలపై స్పైస్‌జెట్‌ను పూర్తిస్థాయి వివరణ కోరింది డీజీసీఏ. విమానాల భద్రతా ప్రమాణాలు తగ్గిన అంశంపై వివరణ ఇవ్వాలని స్పైజ్‌జెట్‌ను డీజీసీఏ ఆదేశించింది.
జూన్ 19న రెండు ఘటనలు, జూన్ 25న ఒకటి, జులై 2న మరోక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవిగాక ఇంకా చోటు చేసుకున్నాయి. ఇక మంగళవారం ఢిల్లీ-దుబాయ్ విమానం సాంకేతికలోపంతో కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే.
గత మూడేండ్లుగా స్పైస్‌జెట్ నష్టాల్లో కొనసాగుతోంది. 2018-19, 2019-20, 2020-21 సంవత్సరాల మధ్య రూ.316 కోట్లు, రూ.934 కోట్లు, రూ.998 కోట్లు వరుసగా నష్టాలు చవిచూసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 06 Jul,2022 03:03PM