లండన్ : బ్రిటన్‌లో ప్రధాని బోరిస్ జాన్సన్ మంత్రి వర్గం నుంచి మరో ఇద్దరు మంత్రులు వైదొలిగారు. ఇప్పటికే ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రులు రిషి సునక్, సాజిద్ జావిద్ లు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శిశు, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విల్ క్వీన్స్, జూనియర్ రావాణా శాఖ మంత్రి లారా ట్రాట్‌లు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా సమర్పించడం తప్ప మరో మార్గం లేదని విల్ క్వీన్స్ అన్నారు. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవడం వల్ల తన పదవికి రాజీనామా చేశానని అన్నారు. అలాగే ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోయిందని ట్రాట్ పేర్కొన్నట్లు నివేదిక పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm