హైదరాబాద్ : నెలకు ఒక్క నేతను అయినా బీజేపీలోకి తీసుకొస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇటీవల ఆయన బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను పార్టీ చేరికల సమన్వయ కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టేందుకు అవకాశం లేదన్నారు. తాను బీజేపీలో చేరుతున్న విషయం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలందరికీ తెలుసని చెప్పారు. తాను ఇన్ని రోజులు తటస్థంగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని.. ఇప్పుడు బీజేపీలో చేరే సరికి అంతా అడుగుతున్నారని తెలిపారు. టీఆర్ఎస్ లో కాళ్లు మొక్కించుకోవడం, డబ్బులు తీసుకోవడం, కేసులతో బెదిరించడం తప్ప ఏమీ లేదని ఆరోపించారు.
Mon Jan 19, 2015 06:51 pm