హైదరాబాద్ : లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ది వారియర్.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జులై 14న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో నేడు సాయంత్రం 6:30 గంటలకు ఐకానిక్ సత్యం సినిమాస్‌లో జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కు ఏకంగా 28 మంది సెలబ్రిటీలు ముఖ్యఅతిథులుగా రానున్నారు. డైరెక్టర్లు మణిరత్నం, శంకర్, విట్రిమారన్, భారతీరాజా, గౌతమ్ మీనన్, ఎస్‌జే సూర్య, భారతీరాజా, లోకేశ్ కనగరాజ్, హెచ్ వినోథ్, శశి, కార్తీక్ సుబ్బరాజు, పీఎస్ మిత్రన్, విక్రమ్ ఫ్రభు, శివ, పార్థీబన్‌తోపాటు కార్తీ, విశాల్, కీర్తిసురేశ్‌తోపాటు పలువురు నటీనటులు చీఫ్ గెస్టులుగా రానున్నారు.
ఇక తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 10న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో జరుగనుంది. ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతిశెట్టి కథానాయిక. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.