హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని తారామతిపేట ఔటర్ రింగ్‌రోడ్డుపై డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ట్యాంకర్‌ను రహదారిపై నుంచి తొలగించారు. చర్లపల్లి నుంచి కోదాడకు వెళ్తుండగా ట్యాంకర్ అదుపు తప్పి పల్టీ కొట్టినట్టు తెలిసింది. రహదారిపై ట్యాంకర్ బోల్తా పడటంతో ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడింది.
Mon Jan 19, 2015 06:51 pm