- పట్నం డిమాండ్
హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ రకాల పథకాల కింద అర్హులుగా ఎంపికైన 11.16 లక్షల మంది పేదలు గత నాలుగు సంవత్సరాలుగా పెన్షన్ కోసం ఎదురుచూస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీరందరికీ తక్షణమే పెన్షన్లు మంజూరు చేసి బకాయిలతో సహా చెల్లించాలని పట్నం (తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
చనిపోయిన కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా అర్హులుగా గుర్తించబడి పెండింగ్‌లో ఉన్నవారు 3.16 లక్షల మంది ఉన్నారన్నారు. వీరిలో వితంతువులు 1.60 లక్షలు, వృద్ధులు 64,750, వికలాంగులు 55,620 కాగా మిగిలినవి ఇతర పెన్షన్లు అని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం గత సంవత్సరం వృద్ధాప్య పించను అర్హత వయసు 60 నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ దరఖాస్తులు పెట్టుకోవాలని ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ మేరకు మండల, జిల్లాస్థాయిలో దరఖాస్తు చేసుకున్నవారిలో 8 లక్షల మందిని అర్హులుగా ఎంపికచేశారని.. అయితే ఇవి ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కాలేదన్నారు.
పెండింగ్‌లో ఉన్న 3.16 లక్షల లబ్దిదారులకు అర్హత కాలం నుంచి చెల్లించాలని, అదేవిధంగా రిటైర్‌మెంట్ వయసు 57 సంవత్సరాలకు తగ్గింపుతో అర్హులైన వారిని ఎంపికచేసిన మరో 8 లక్షల మందికి 2021 సంవత్సరం నుండి పెన్షన్ మంజూరు చేసి బకాయిలతో సహా చెల్లించాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెన్షన్‌దారులందరినీ కదిలించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాసంఘాలు ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్నం ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 06 Jul,2022 06:29PM