న్యూఢిల్లీ : భారత వాయుసేనలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఒకేసారి యుద్ధ విమానాన్ని తండ్రి, కూతురు నడిపి రికార్డు సృష్టించారు. వారే ఎయిర్ కమొడోర్ సంజయ్ శర్మ, ఆయన కుమార్తె ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య శర్మ. హాక్ ఏజేటీ యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి తండ్రీకూతుళ్లుగా నిలిచారు.
కర్ణాటకలో బీదర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఇందుకు వేదికైంది. మే 30వ తేదీన హాక్-132 ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఈ తండ్రీకూతుళ్లు ప్రయాణించారు. ఓ మిషన్ కోసం ఇలా తండ్రి, కుమార్తె ఒకే యుద్ధ విమానంలో కలిసి ప్రయాణించడం ఇదే మొదటిసారి అని వాయుసేన తెలిపింది.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీటెక్ పూర్తి చేసిన అనన్య శర్మకు సైన్యంలో చేరి, యుద్ధ విమానాలను నడపాలని చిన్ననాటి నుంచి కోరిక ఉండేది. అందుకు ఆమె తండ్రి సంజయ్ శర్మే ఆమెకు స్ఫూర్తిగా నిలిచారు. 2016లో భారత వైమానిక దళంలో తొలి మహిళా ఫైటర్ పైలట్ బ్యాచ్‌లో స్థానం సంపాదించి తన కోరిక నెరవేర్చుకున్నారు. ఆ తర్వాత ఫ్లైయింగ్ బ్రాంచ్ శిక్షణకు ఎన్నికయ్యారు. అనుభవ జ్ఞులైన పైలట్ల పర్యవేక్షణలో కఠోర శిక్షణ పొంది కిందటేడాది డిసెంబర్‌లో ఫైటర్ పైలట్‌గా నియామకం పొందారు. తన జీవిత కాల లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 06 Jul,2022 07:17PM