హైదరాబాద్: పలు లోన్‌యాప్ సంస్థల ఆగడాలు మీతిమీరిపోతున్న నేపథ్యంలో ఈడీ దీని పై దృష్టి సారించింది. తాజాగా నాలుగు లోన్‌యాప్ సంస్థలు కుడుస్ ఫైనాన్స్, ఎస్ మనీ, రహినో, పయనీస్‌లలో ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహించారు.రూ.86.65 కోట్లను ఫ్రీజ్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు బ్యాంక్ ఖాతాల్లోని రూ.186 కోట్లు ఈడీ జప్తు చేసింది. లోన్‌యాప్ ద్వారా 4 చైనా కంపెనీలు రూ.940.46 కోట్లు వసూలు చేశాయని, ఇవి భారతదేశ చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని విచారణలో తేలినట్టు తెలిసింది. వసూలు చేసిన ఈ డబ్బును విదేశాలకు హవాలా ద్వారా బదిలీ చేసినట్టు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm