హైదరాబాద్ : ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన టెట్‌లో పాసైన అభ్యర్థులకు మంత్రి హరీశ్ రావు శుభవార్త చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్ రాకముందే ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తామని ప్రకటించారు. సిద్దిపేట జిల్లా పొన్నాలలో టీఎస్ టెట్ ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులతో మంత్రి హరీశ్‌రావు బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌లో 32 శాతం ఉత్తీర్ణత సాధిస్తే.. కేవలం సిద్దిపేటలోని కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ నుంచి 82 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. టెట్ ఉత్తీర్ణత అయిన విద్యార్థులందరూ ఉద్యోగాలు సాధించినప్పుడే ఉచిత కోచింగ్ సెంటర్‌కు సార్ధకత లభిస్తుందని తెలిపారు.
618 మంది అభ్యర్థులకు గానూ 517 మంది పాసయ్యారని మంత్రి చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్ రాకముందే లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇప్పిస్తామని తెలిపారు. త్వరలోనే గ్రూప్-4కి నోటిఫికేషన్ రాబోతుందని... దానికి కూడా ఉచితంగా కోచింగ్ ఇస్తామని మంత్రి చెప్పారు. ఈసారి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు చాలా అదృష్టవంతులు అన్నారు. సీఎం కేసీఆర్.. రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చి స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా కృషి చేశారన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయకుండా యువత నోట్లో మట్టి కొడుతుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం తుమ్మితే ఊడిపోయే ఉద్యోగమని ఎద్దేవా చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల 50వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెంటనే భర్తీ చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాదికే లక్ష 50 వేలు ఉద్యోగాలకు ఇప్పటికే లక్షా 30 ఉద్యోగాలు ఇచ్చామని, ఈ యేటా మరో 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 06 Jul,2022 08:25PM