అశ్వారావుపేట లో బాబూ జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం...
చిత్రపటాన్ని వర్షంలో వదిలేసిన నిర్వాహకులు...
నవతెలంగాణ - అశ్వారావుపేట
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దివంగత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగజ్జీవన్ రామ్ ఫోటోకు ఆయన వర్ధంతి రోజే అవమానం జరిగింది. జగజ్జీవన్ రామ్ 38 వ వర్ధంతి కార్యక్రమం బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలో మండల పరిషత్ పూర్వ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు.
అయితే అనంతరం ఆ చిత్రపటాన్ని ప్రాంగణంలో వదిలి వెళ్లడంతో రోజంతా కురిసిన వర్షానికి ఫోటో తడిచిపోయింది. నివాళులు అర్పించి, ఫొటోలకు ఫోజులు ఇచ్చిన నాయకులు ఆయన చిత్ర పటాన్ని అలా గాలికి వదిలేయడం చర్చాంశనీయం అయింది. జగజ్జీవన్ వర్ధంతి కార్యక్రమంలో కలపాల శ్రీను,డిసిసిబి డైరెక్టర్ నిర్మల పుల్లారావు,నార్లపాటి శ్రీను, కట్రం స్వామి, బీమ్ రావ్ యూత్ సభ్యులు బొడ్డపాటి ఉమ, తగరం హరి, బొక్కా రాంబాబు, నార్లపాటి సుధాకర్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 06 Jul,2022 08:32PM