హైదరాబాద్ : సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై నిజామాబాద్‌లో ముగ్గురు పీఎఫ్ఐ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తులను వ్యాపారి షేక్ షాదుల్లా, చికెన్ షాపులో పనిచేసే మహ్మద్ ఇమ్రాన్, వెల్డింగ్ కార్మికుడు మహ్మద్ అబ్దుల్ మోబిన్ గా గుర్తించారు. వీరంతా నిజామాబాద్ పట్టణానికి చెందిన వారని సమాచారం. దీనిపై సీపీ నాగరాజు విలేకరుల సమావేశంలో మాట్లడారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న షాదుల్లా, ఇమ్రాన్, మోబిన్ అనే ముగ్గురు పీఎఫ్ఐ సభ్యులను నిజామాబాద్‌లో అరెస్టు చేశామని తెలిపారు. వీరు కరాటే శిక్షణ ముసుగులో ఓ వర్గాన్ని రెచ్చగొట్టి మరో వర్గంపై వ్యతిరేక భావజాలాన్ని నూరుపోస్తున్నారన్నారు. దాడులు చేయడం, అల్లర్లు సృష్టించడం ఈ ముఠా పని అని.. ఈ ముఠాకు ఇతర రాష్ట్రాల్లోనూ సంబంధాలున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm