హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్, పరుగుల రాణి పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డేలను రాష్ట్రపతి కోటాలో కేంద్రం రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆయ రంగాలో వీరు చేసిన విశేష కృషిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం వారిని ఎంపిక చేసింది.
రాజ్యసభకు ఎంపికైన వీరికి ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇళయ్యరాజా సృజనాత్మక మేధావి అని, తరతరాలుగా ప్రజలను ఆకర్షించారన్నారు. అతని రచనలు అనేక భావోద్వేగాలను అందంగా ప్రతిబింబిస్తాయని చెప్పారు. అతని జీవిత ప్రయాణం కూడా అంతే స్ఫూర్తిదాయకమన్నారు. నిరాడంబరమైన నేపథ్యం నుండి ఎదిగి చాలా సాధించాడని... రాజ్యసభకు నామినేట్ కావడం సంతోషంగా ఉందన్నారు.
విజయేంద్ర ప్రసాద్ దశాబ్దాలుగా సృజనాత్మక ప్రపంచంతో అనుబంధం కలిగి ఉన్నారని మోడీ పేర్కొన్నారు. అతని రచనలు భారతదేశం అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఒక ముద్ర వేశాయన్నారు. రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు.
పీటీ ఉషా ప్రతి భారతీయునికి స్ఫూర్తి అని.. క్రీడలలో ఆమె సాధించిన విజయాలు విస్తృతంగా తెలిసినప్పటికీ, గత కొన్ని సంవత్సరాలుగా వర్ధమాన క్రీడాకారులకు మార్గదర్శకత్వం వహించడానికి ఆమె చేసిన కృషి కూడా అంతే మెచ్చుకోదగినదని ప్రధాని అన్నారు. రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఆమెకు అభినందనలు తెలిపారు.
వీరేంద్ర హెగ్గడే విశిష్టమైన సమాజ సేవలో ముందున్నారని... ధర్మస్థల ఆలయంలో ప్రార్థనలు చేసే అవకాశం తనకు లభించిందన్నారు. ఆరోగ్యం, విద్య మరియు సంస్కృతిలో ఆయన చేస్తున్న గొప్ప పనిని కూడా చూసాను అని తెలిపారు. ఆయన కచ్చితంగా పార్లమెంటు కార్యకలాపాలను సుసంపన్నం చేస్తారని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 06 Jul,2022 09:16PM