హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో రేంజ్ అధికారి మరణించాడు. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు దారుణ హత్యకు గురైన ఘటన మరువక ముందే, మరో అధికారి మృతి చెందాడు. జగిత్యాల జిల్లా కోరట్లకు చెందిన సాయి ప్రసాద్… జయశంకర్ భూపాల పల్లి జిల్లాలోని మహదేవ్ పూర్ డిప్యూటీ రేంజ్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే, సాయి ప్రసాద్ కుటుంబంతో పాటు వెంకన్న దర్శనం కోసం తిరుపతి వెళ్లాడు. కాలినడకన కొండ ఎక్కుతానని మొక్కుకున్న సాయి ప్రసాద్.. తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే, అలిపిరి నడక మార్గంలో వెళుతున్న సాయి ప్రసాద్ కు ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. దీంతో అతన్ని స్థానికులు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా, మధ్యలోనే మరణించాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Nov,2022 07:50AM