ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. మూసి ఉన్న కంటెయినరులో 29 ఆవులు మరణించాయి. యూపీలోని మధుర జిల్లాలోని జాతీయ రహదారి సమీపంలో నిలచి ఉన్న ఓ కంటెయినరులో 29 ఆవులు మరణించి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. మూసి ఉన్న కంటెయినరులో 29 ఆవులు మరణించగా, ఓ ఆవు సజీవంగా ఉందని పోలీసులు గుర్తించారు. ఆవులు మరణించి ఉన్న కంటెయినర్ డ్రైవరు పరారీలో ఉన్నాడని మధుర సర్కిల్ పోలీసు అధికారిణి హర్షితాసింగ్ చెప్పారు. మూసి ఉన్న కంటెయినరులో 29 ఆవులు మరణించి ఉన్నాయని సమాచారం అందటంతో తాము దాన్ని తెరచి స్వాధీనం చేసుకున్నామని హర్షితాసింగ్ చెప్పారు. కంటెయినరులో ఆవులు మరణించిన ఘటనపై తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm