ఖమ్మం : గొత్తికోయలను బహిష్కరిస్తూ బెండాలపాడు గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్యను గ్రామసభ ఖండించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రబోడు నుంచి గుత్తి కోయలను బహిష్కరిస్తూ గ్రామసభ తీర్మానం చేసి, గుత్తి కోయలను స్వరాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు పంపాలంటూ నిర్ణయించింది. గంజాయి, నాటుసారా సేవిస్తూ నిత్యం మారణాయుధాలు ధరించి గుత్తికోయలు విచక్షణ కోల్పోతున్నారని తీర్మానంలో సభ పేర్కొన్నది. గుత్తి కోయల ప్రవర్తనతో తమకు ప్రాణహాని పొంచి ఉందని తీర్మానంలో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారిని ఛత్తీస్‌గఢ్‌కు తరలించాల్సిందేనని సభ తీర్మానించింది.
Mon Jan 19, 2015 06:51 pm