హైదరాబాద్: బంగ్లాదేశ్ తో టీమిండియా 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. ఈ తరుణంలో బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ కు జడేజా దూరమైనట్టు, అతడి స్థానంలో కొత్త స్పిన్నర్ సౌరభ్ కుమార్ ను ఎంపిక చేయనున్నట్టు సమాచారం. బంగ్లాదేశ్ లో టీమిండియా పర్యటన డిసెంబరు 4 నుంచి షురూ కానుంది. కాగా, టెస్టు సిరీస్ డిసెంబరు 14 నుంచి జరగనుండగా అప్పటికల్లా రవీంద్ర జడేజా కోలుకుంటాడని భావించారు. కానీ జడేజాకు శస్త్రచికిత్స జరిగిన క్రమంలో అతడు కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. జడేజా స్థానాన్ని భర్తీ చేయనున్న సౌరభ్ కుమార్ కూడా లెఫ్టార్మ్ స్పిన్నరే. ఉత్తరప్రదేశ్ కు చెందిన సౌరభ్ కుమార్ దేశవాళీల్లో విశేషంగా రాణిస్తున్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm