హైదరాబాద్: డిసెంబర్ 17, 18 తేదీల్లో రాజధాని సమస్యను జాతీయ స్థాయిలో వినిపించేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఆందోళన చేపట్టనున్నారు. దేశ రాజధానికి వెళ్లేందుకు ఇప్పటికే రైలును కూడా బుక్ చేసుకున్నారు. సుమారు 2వేల మంది విజయవాడ నుంచి బయలుదేరనున్నారు. డిసెంబర్ 17వ తేదీ నాటికి రాజధాని ఉద్యమం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాజధాని రైతులు అమరావతితో భేటీ అయ్యారు. డిసెంబర్ 15న ఢిల్లీకి బయల్దేరాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అక్కడ 19వ తేదీ కిసాన్ సంఘాల ర్యాలీలో కూడా పాల్గొని, అదే రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి అమరావతికి బయలుదేరనున్నట్లు తెలిసింది.
Mon Jan 19, 2015 06:51 pm