🇮🇳🇦🇪🇿🇦 Leaders of the #OneFamily. 💙#MICapeTown #MIEmirates @MIEmirates @MICapeTown @ImRo45 @KieronPollard55 @rashidkhan_19 pic.twitter.com/ngGMQWSrgS
— Mumbai Indians (@mipaltan) December 2, 2022
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ నాయకుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఇప్పుడు ముంబై ఫ్రాంఛైజీల కెప్టెన్ల జాబితాలో పొలార్డ్, రషీద్ కూడా చేరడం విశేషం. వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్, అఫ్గనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్‌కు ముంబై ఇండియన్స్ యాజమాన్యం రిలయన్స్ కీలక బాధ్యతలు అప్పగించింది. విదేశీ టీ20 లీగ్‌లలో తమ జట్లకు వీరిద్దరిని కెప్టెన్లుగా నియమించింది. ఈ మేరకు ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ ప్రకటన విడుదల చేసింది. యూఏఈ ఐఎల్‌టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌కు కీరన్ పొలార్డ్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌కు రషీద్ ఖాన్ సారథ్యం వహిస్తారని తెలిపింది. వీరిద్దరిపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఆయా లీగ్‌లలో తమ జట్లను ఉన్నత శిఖరాలకు చేరుస్తారనే నమ్మకం ఉందని తెలిపింది.