నవతెలంగాణ న్యూఢిల్లీ: జేఎన్‌యూలో గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కనిపించడంతో, దీనిపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఉప కులపతి ప్రొఫెసర్ శాంతిశ్రీ డీ పండిట్ ఆదేశించారు. ఈ నినాదాలకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. జేఎన్‌యూలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ భవనాలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలను రాయడాన్ని ఉప కులపతి తీవ్రంగా పరిగణించారని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ నినాదాలను రాసినట్లు అందులో తెలిపింది. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వేరు భావనల ధోరణులను యాజమాన్యం ఖండిస్తోందని తెలిపింది. జేఎన్‌యూ అందరికీ చెందుతుందని, అందువల్ల ఇటువంటి సంఘటనలను సహించేది లేదని పేర్కొంది.
స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్-2 భవనంపై బ్రాహ్మణ, వైశ్య వ్యతిరేక నినాదాలను గుర్తు తెలియని వ్యక్తులు రాశారని కొందరు విద్యార్థులు తెలిపారు. ‘‘బ్రాహ్మణులు ఈ క్యాంపస్‌ను విడిచిపొండి’’, ‘‘బ్రాహ్మణులారా, భారత్‌ను విడిచిపొండి’’, ‘‘బ్రాహ్మణులారా, వైశ్యులారా, మేం మీ కోసం వస్తున్నాం. ప్రతీకారం తీర్చుకుంటాం’’ అని రాశారని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 02 Dec,2022 05:41PM