హైదరాబాద్: వైసీపీ పార్టీ ఈ నెల 7న బీసీ సభ నిర్వహిస్తున్న తరుణంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వారిపై మండిపడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు టీడీపీ కన్నతల్లి వంటిది, వైసీసీ సవతి తల్లి లాంటిదన్నారు. సీఎం జగన్ రెడ్డి పదవులన్నీ సొంత సామాజికవర్గానికే కట్టబెట్టాడని ఆరోపించారు. వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచాడని అయ్యన్న విమర్శించారు. వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీనే అని స్పష్టం చేశారు. బీసీల పదవులు, నిధులు దోచేసి, రిజర్వేషన్లకు కోత విధించిన వ్యక్తి జగన్ మోసపు రెడ్డి అని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm