. @SSRajamouli wins the prestigious New York Film Critics Circle Award for the Best Director! @NYFCC
— BA Raju's Team (@baraju_SuperHit) December 3, 2022
Congratulations #SSRajamouli & team #RRRMovie. May you win many more awards... pic.twitter.com/V5QZZgg4yb
హైదరాబాద్: రాజమౌళి ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకున్న విషయం తెలిసిందే. ఆ తరుణంలో తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నాడు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్(NYFCC) ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళిని ఎంపిక చేసింది. ఈ అవార్డు సాధించిన తొలి భారతీయ దర్శకుడిగా రాజమౌళి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లీష్ సినిమాలతో పోటీ పడి ఒక టాలీవుడ్ సినిమా ఈ ఘనత సాధించిందంటే రాజమౌళి గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఇటీవలే లాస్ ఏంజిల్స్ టైమ్స్ అనే ఇంగ్లీష్ పేపర్ రాజమౌళి గురించి ఫ్రంట్ పేజ్‌లో ఓ పెద్ద ఆర్టికల్ ప్రచురించింది. అయితే ఓవరల్‌గా 1200కోట్లకు పైగా కలెక్షన్‌లు సాధించి రాజమౌళికి వరుసగా రెండోసారి 1000 కోట్ల క్లబ్‌లో నిలిచిన సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్ రికార్డు క్రియేట్ చేసింది.