హైదరాబాద్: రాజ్ భవన్ లో నిర్వహించిన ముర్ము సన్మాన కార్యక్రమానికి వైఎస్ భారతి కూడా విచ్చేశారు. ఈ తరుణంలో వైఎస్ భారతి రాష్ట్రపతికి ఓ విశిష్టమైన పట్టుచీరను బహూకరించారు. ఆ కానుక అందుకున్న రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎం జగన్, వైఎస్ భారతి ఓ చిత్రపటాన్ని కూడా రాష్ట్రపతికి బహూకరించారు.
ఇవాళ నేవీ డే సందర్భంగా విశాఖ తీరంలో నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ చేరుకున్నారు. విశాఖలో ఆమెకు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వం తరఫున స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ద్రౌపది ముర్ము నగరంలోని ఆర్కే బీచ్ కు తరలి వెళ్లారు. ఆమె వెంట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్రమంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా తరలి వెళ్లారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 04 Dec,2022 05:29PM