హైదరాబాద్: మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ కాలేజ్ ప్రాంగణంలో బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. మనతో సమానంగా కేంద్రం పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. మోడీ సర్కార్ వల్ల తెలంగాణ రూ.3లక్షల కోట్లు కోల్పోయిందని, కేంద్రం సహకరించి ఉంటే తెలంగాణ జీఎస్‌డీపీ ఇంకా పెరిగి ఉండేదని చెప్పారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చేందుకు మోదీకి 8ఏళ్లు కూడా సరిపోలేదా? అని అన్నారు. తెలంగాణకు బీజేపీ నేతలు ఏమీ చేయరని, చేసేవారి కాళ్లల్లో కట్టెలు పెడతారని వ్యాఖ్యనించారు. దేశంలో ఏం జరుగుతుందో యువత, మేధావులు ఆలోచన చేయాలని కేసీఆర్ సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm