హైదరాబాద్: అంతర్జాతీయంగా పడిపోతున్న చమురు ధరలు.. మన దేశంలో ధర తగ్గుదలకు సూచికగా పేర్కొంటున్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవల్‌లో బ్యారెల్ క్రూడాయిల్ ధర భారీగా తగ్గినప్పటికీ.. మన దేశంలో మాత్రం పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. ఈ తరుణంలో తాజా పరిస్థితులు మన దేశ వాహనదారులకు భారీ ఊరటనిస్తాయంటున్నారు.
పెట్రోల్, డీజీల్ ధరలు త్వరలో భారీగా తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఈ తగ్గింపు సుమారు 5 రూపాయల వరకు ఉండవచ్చు. ఈ నెల 8 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో కేంద్రం కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. రష్యా సైతం భారత్‌కు భారీ తగ్గుంపు ధరలో ముడి చమురును విక్రయిస్తోంది. దాదాపు 40 శాతం తగ్గింపుతో ముడి చమురును సరఫరా చేస్తోంది. మార్కెట్ వర్గాలు అనుకుట్టే జరిగితే పెట్రోల్ ధరలు తగ్గేందుకు మార్గలున్నట్లు తెలుస్తుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 04 Dec,2022 09:40PM