కర్నూలు: రాయలసీమ గర్జన సభ సందర్భంగా నంద్యాలలో ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. పరీక్షలను రద్దుచేసి స్కూళ్లకు సెలవు ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కర్నూలులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎస్టీబీసీ కళాశాల వేదికగా జరిగే రాయలసీమ గర్జన సభకు సగం వరకే ఏర్పాట్లు జరిగాయి. సగం మైదానంలో కుర్చీలు కూడా వేయని వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm