హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలోని మెంగారం చెరువు కింది భాగంలో ఆంజనేయులుకు ఎకరం భూమి ఉంది. అయితే ప్రతి ఏడాది ఆంజనేయులు భూమి మీదుగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. అయినా ప్రతి సంవత్సరం సాగుచేసుకుంటున్నాడు. అయితే నిత్యం నీళ్లు ప్రవహించడంతో ఆంజనేయులుకు దిగుబడి రావడంలేదు. కొన్ని సందర్భాల్లో నీళ్లు ఎప్పుడూ ప్రవహించడంతో పంట కుళ్లిపోతోంది.
ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. అయినా అధికారులు పట్టించుకొకపోవడంతో సెల్ టవర్ ఎక్కాడు. గంటల తరబడి అక్కడే ఉండి తనకు న్యాయం చేయాలని, లేకపోతే నష్టపరిహారం ఇవ్వాలని సెల్ టవర్ మీద నుంచి ఆంజనేయులు వేడుకున్నాడు. అయినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో అక్కడే ఉరి వేసుకుని రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Dec,2022 08:26PM