హైదరాబాద్: వచ్చే ఏడాది ప్రపంచకప్‌కు భారత జట్టులో శుబ్‌మన్ గిల్‌కు కచ్చితంగా చోటు దక్కుతుందని టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. శుబ్‌మన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గిల్ తన ఫామ్‌ను కొనసాగిస్తాడని భావిస్తున్నాను. 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఓపెనర్ల రేసులో గిల్ కచ్చితంగా ఉంటాడు. జట్టులో చోటు కోసం గిల్ చాలా కష్టపడుతున్నాడు. రాబోయే రోజుల్లో భారత జట్టుకు కీలక ఆటగాడిగా గిల్ మారుతాడు అని పీటీఐతో యువరాజ్ తెలిపాడు. ఇదే తరుణంలో భారత్‌లో క్రీడల అభివృద్దికి తన వంతు కృషిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నాడు.