‘Varahi’ is ready for Election Battle! pic.twitter.com/LygtMrp95N
— Pawan Kalyan (@PawanKalyan) December 7, 2022
హైదరాబాద్: త్వరలోనే జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలో బస్సు యాత్ర చేపట్టబోతున్న తరుణంలో పవన్ బస్సుయాత్రకు ఉపయోగించే భారీ వాహనం సిద్ధమైంది. అయితే ఈ బస్సుకు వారాహి అని పేరుపెట్టినట్టు పవన్ తెలిపారు. ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధమైంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆ బస్సు ఆలివ్ రంగులో చూడ్డానికి మిలిటరీ వాహనంలా కనిపిస్తోంది. ఈ వాహనంలో పవన్ కు అవసరమైన సదుపాయాలతో రూపోందించడం విశేషం. అంతే కాకుండా ఈ బస్సులో హై సెక్యూరిటీ సిస్టమ్ తో పాటు, జీపీఎస్ ట్రాకింగ్, 360 డిగ్రీల్లో రికార్డ్ చేయగల సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, రాత్రివేళల్లో సభల కోసం లైటింగ్ సిస్టమ్ ను పొందుపరిచారు. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ వీడియో, ఫొటోలను పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.