భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని అశ్వరావుపేట మండలం ఖమ్మంపాడు గ్రామానికి చెందిన చిచ్చోడి దుర్గమ్మ అనే వృద్ధురాలు తేనెటీగల దాడిలో మృతి చెందింది. నిన్న పొలం పనికి వెళ్ళొస్తుండగా కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. వృద్ధురాలు కావడంతో దుర్గమ్మ తప్పించుకోలేకపోయింది. వృద్ధురాలిని తేనెటీగలు తీవ్రంగా గాయపరడంతో గ్రామస్థులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ దుర్గమ్మ ఈరోజు ఉదయం మృతి చెందింది.
Mon Jan 19, 2015 06:51 pm