హైదరాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ టికెట్‌పై నార్త్ జామ్‌నగర్ నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 61,065 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ తరుణంలో రివాబా మాట్లాడుతూ నాకు అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన బీజేపీతో పాటు నా కోసం ప్రచారంలో పనిచేసిన కార్యకర్తలకు, నాకు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు. ఇది నా విజయం మాత్రమే కాదు. ప్రజలందరి విజయం అంటూ తన విజయంపట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm