Jodhpur, Rajasthan | Around 60 people injured after a house caught fire during a wedding in Bhungra village
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 9, 2022
It's a very serious accident. 42 people out of the 60 injured were referred to MGH hospital. Treatment is going on: Himanshu Gupta, District Collector (08.12) pic.twitter.com/9DYKOeHFrE
నవతెలంగాణ జోధ్‌పూర్: రాజస్థాన్ జోధ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకున్నది. జోధ్‌పూర్‌లోని భుంగ్రా గ్రామంలోని పెండ్లింట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 60 మంది గాయపడ్డారు. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికుల సహకారంతో గాయపడినవారిని దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారని, వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘనటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.