నవతెలంగాణ - హైదరాబాద్
అపార్ట్మెంట్ సెక్రటరీని అంటూ ఓ గృహిణిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తి పై కేసు నమోదైంది. నగరానికి చెందిన మహిళ తొమ్మిది నెలల క్రితం కుటుంబంతో కలిసి యూసుఫ్‌గూడ గీత అపార్ట్మెంట్లో అద్దెకు వచ్చారు. ఈమెకు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అపార్ట్మెంట్లో పరిచయం అయ్యాడు. తాను అపార్ట్మెంట్ కార్యదర్శిని అని చెబుతూ ప్రతీ నెల మెయింటెనెన్స్ డబ్బుల కోసం ఫోన్ చేసేవాడు. ఇటీవల అతను కార్యదర్శి కాదని మహిళకు తెలిసింది. అప్పటి నుంచి అతడిని పట్టించుకోవడం మానేసింది. ఈ నెల 14న వెంకటేశ్వరరావు ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం లైంగిక వేధింపులకు గురిచేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Jan,2023 07:13AM