నవతెలంగాణ - హైదరాబాద్
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు స్వామివారి దర్శనం కోసం భక్తులతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి మరీ వెలుపలికి వచ్చాయి. శ్రీవారి టోకెన్ లేని భక్తుల దర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 58,379 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారికి 28,950 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Jan,2023 08:19AM