నవతెలంగాణ - చెన్నై
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి గుండెపోటుతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఆయన ఎన్నో ఏళ్ల నుంచి సినీ రంగానికి సేవలు అందిస్తున్నారు. సూర్య, అజిత్, మోహన్‌లాల్, కార్తి, విక్రమ్‌తోపాటు పలువురు స్టార్ హీరోలకు ఆయన తెలుగులో డబ్బింగ్ చెప్పారు. సహాయనటుడిగానూ ఆయన ఎన్నో చిత్రాల్లో నటించారు. ఈ తరుణంలో ఆయన మృతికి సంతాపం తెలుపుతూ పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Jan,2023 11:55AM