నవతెలంగాణ-ఢీల్లీ
ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యకమ్రంలో ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఢీల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియం వేదికైంది. ఈ తరుణంలో విద్యార్థులతో సమయపాలన గురించి మాట్లాడారు. రోజూ ఇంట్లో అమ్మను చూస్తే సమయపాలన ఎలా నిర్వహించుకోవాలో మనకు తెలుస్తుందన్నారు. ఇక ఈ కార్యక్రమంపై ఇంతకుముందు ప్రధాని ట్విటర్‌లో స్పందించారు. ఈ రోజు ఇలా చిన్నారుల మధ్య ఉండటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Jan,2023 12:04PM