నవతెలంగాణ- ఢీల్లి
2023 ఏడాదికి గాను కేంద్ర హోంశాఖ ఈ సారి 106 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది. వీటిలో ఆరు పద్మవిభూషణ్, తొమ్మిది పద్మభూషణ్, 91 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఈ ఏడాది ఇద్దరు ప్రవాస భారతీయులకు పద్మ అవార్డులు దక్కాయి.
ప్రఖ్యాత భారతీయ అమెరికన్ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస వరదన్‌ను దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వరించింది. అలాగే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో చేసిన విశేషమైన సేవలకు గాను కెనడాకు చెందిన సుజాత రామ్‌దొరైకు పద్మశ్రీ దక్కింది. శ్రీనివాస వరదన్ 1940 జనవరి 2న తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించారు. గణితంలోని సంభావ్యత సిద్ధాంతంపై ఎన్నో ప్రయోగాలు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.