నవతెలంగాణ-హైదరాబాద్ : విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు కాల్వ గట్టు సమీపంలో ప్రియుడిపై ప్రియురాలు కత్తితో దాడి చేసింది. విజయవాడ రామవరప్పాడు కాల్వ గట్టుపై తాపీ పని చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసముంటున్న లక్ష్మీతో రమణ కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇరువురి మధ్య పలుమూర్లు గొడవలు చోటు చేసుకున్నాయి. రమణపై పటమట పోలీసుస్టేషన్‌లో లక్ష్మీ రెండు సార్లు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో బుధవారం లక్ష్మీ, రమణల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన లక్ష్మీ కూరగాయల కోసే చాకుతో రమణ పొట్టలో పొడిచేసింది. వెంటనే రమణని స్ధానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ రమణ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లక్ష్మీని అదుపులోని తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm