నవతెలంగాణ - హైదరాబాద్
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. హెలిక్యాప్టర్ ద్వారా ఉదయం 8.45 గంటలకు కలెక్టరేట్ సముదాయానికి చేరుకుంటారు. 9 గంటలకు భూమారెడ్డి ఫంక్షన్ హాల్‌లో కాకతీయ శాండ్‌బాక్స్ కార్యక్రమంలో పాల్గొంటారు. 11.15 గంటలకు రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. 11.30 గంటలకు ఇందూరు కళాభారతి ఆడిటోరియానికి భూమి పూజ చేస్తారు. మధ్యాహ్నం 12.30కు తెలంగాణభవన్‌లో మాట్లాడుతారు. ఒంటి గంటకు విశ్వం డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. 1.15 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు. కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jan,2023 07:21AM