హైదరాబాద్: కిర్గిజ్‌స్థాన్, చైనాలో స్వల్పవ్యవధిలో భారీ భూకంపాలు చోటుచేసుకున్నాయి. సోమవారం ఉదయం 5.19 గంటలకు కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్‌కేక్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 5.8గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. బిష్‌కేక్‌కు 726 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని ప్రకటించింది.
ఇక చైనాలోని అరాల్‌లో 5.9 తీవ్రతతో భూమి కంపించింది. ఉదయం 5.49 గంటలకు భూకంపం వచ్చిందని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలజీ సెంటర్ తెలిపింది. అరాల్‌కు 111 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నదని వెల్లడించింది. కాగా, రెండు భూకంప ఘటనల్లో జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉన్నది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 30 Jan,2023 08:37AM