నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. మనోహరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐటీసీ పరిశ్రమను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఆ పరిశ్రమ ప్రతినిధులు వెల్లడించారు. జాతీయ రహదారి పక్కన రూ.460 కోట్ల పెట్టుబడితో 59ఎకరాల్లో ఈ పరిశ్రమను నిర్మించారు. సోమవారం నుంచి ఉత్పత్తులను అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానికంగా వేయిమంది యువతకు ఉపాధిఅవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. మరోవైపు మంత్రి పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 30 Jan,2023 09:16AM